నెటిజన్లకు షాక్ ఇచ్చిన ప్రభాస్!

  Written by : Suryaa Desk Updated: Wed, Nov 25, 2020, 04:28 PM

రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త లుక్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. కండలు తిరిగిన శరీంతో కనపడే ప్రభాస్ ఈ ఫొటోలో చాలా సన్నగా కనపడుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్.. `రాధేశ్యామ్` సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చేయబోయే మరో సినిమా కోసం ప్రభాస్ బరువు తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు. అలాగే, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందించనున్న ‘ఆదిపురుష్’ సినిమాలో ఆయన రాముడి గెటప్‌ లో కనపడాల్సి ఉంది. ఈ సినిమాల కోసమే ప్రభాస్ ఇలా స్లిమ్ గా మారినట్టు తెలుస్తోంది. గతంలో ప్రభాస్ ఫొటోను, ఇప్పటి ఫొటోను పోల్చి చూస్తూ నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు.
Recent Post