మేము పంది మాంసం తింటాం: రష్మిక

  Written by : Suryaa Desk Updated: Thu, Nov 26, 2020, 12:01 PM

సినీ నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల అందరూ ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ని ఫాలో అయ్యేందుకు స్ఫూర్తిని అందించాలనే లక్ష్యంతో "యుఆర్ లైఫ్" అనే వెబ్ సైట్ ను నిర్వహిస్తున్నారు. URLife.co.in వెబ్ సైట్ ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం, ముఖ్యంగా ప్రకృతికి అనుకూలమైన జీవనం, సంపూర్ణ ఆరోగ్యం వంటి కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడమేనట. ఇక అందులో భాగంగా ఆ మధ్య సమంత వచ్చి ఓ వంట చేసి పోగా.. తాజాగా రష్మిక మందన వచ్చింది. రీఛార్జ్ యువర్ లైఫ్ విత్ రష్మిక అనే శీర్షికతో రష్మిక తన వంటలను జనానికి వీడియోల రూపంలో పరిచయం చేస్తూ .. అందంగా ఉంటూనే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో రకరకాల టిప్స్ చెబుతోంది. అందులో భాగంగా రష్మిక తాజాగా చికెన్ పుట్టు కర్రీ ఎలా ఉండాలో చూపించి దాన్ని ఉపాసనకు రుచి చూపించింది. అందులో భాగంగా రష్మిక ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్‌ ను బయటపెట్టింది. తమ సామాజిక వర్గంలో ఎక్కువగా పంది మాంసం తింటారని పేర్కోంది. రష్మిక ఇంకా మాట్లాడుతూ.. పంది మాంసం మా సంప్రదాయ వంటకం అని, పందిని నిప్పు మీద కాల్చి తింటామని చెప్పుకొచ్చింది. అంతేకాదు వైన్ తో కూడా తాము చాలా చేస్తామని, ఒక రకంగా వైన్ కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటామని తెలిపింది.
Recent Post