పెళ్లికి రెడీ అంటున్న హాట్ బ్యూటీ

  Written by : Suryaa Desk Updated: Thu, Nov 26, 2020, 12:39 PM

కరోనా వేళ సెలబ్రిటీలు పెళ్లి పీటలెక్కుతున్నారు. ముఖ్యంగా భారతీయ సినీపరిశ్రమకు చెందిన అనేక మంది హీరోలు హీరోయిన్లు పెళ్లి పీటలెక్కేశారు. ముఖ్యంగా టాలీవుడ్ లో అయితే చాలా మంది హీరోలు ఒక ఇంటివారయ్యారు. దగ్గుబాటి రానా, నితిన్, నిఖిల్ తోపాటు త్వరలో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక సైతం పెళ్లి పీటలెక్కబోతుంది. ఇకపోతే ఇటీవలే చందమామ అదేనండీ కాజల్ అగర్వాల్ సైతం ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. వీటిబాటలోనే మరో హీరోయిన్ వచ్చి చేరారు. బ్రూస్ లీ, ఒంగోలు గిత్త, తీన్మార్ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కృతి కర్బందా సైతం పెళ్లికి రెడీ అంటుందట. కృతి కొన్నాళ్ళుగా పులకిత్ సామ్రాట్ అనే బాలీవుడ్ నటుడితో ప్రేమాయణంలో ఉందని, ప్రస్తుతం డేటింగ్ చేస్తున్న వారిద్దరు త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కనున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కృతి సీక్రెట్ రివీల్ చేయక తప్పలేదు. ప్రస్తుతం పులకిత్ సామ్రాట్‌, నేను రిలేషన్‌లో ఉన్నాం. ఏడాదిన్నరగా ఇద్దరం డేటింగ్ చేస్తున్నాం.కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టిన మేము ఏ సమయంలోనైన పెళ్లి చేసుకోవచ్చు. పునీత్ చాలా మంచి అబ్బాయి. ఇద్దరి అభిప్రాయాలు కలిసాయి. అందుకే రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నాం అంటూ కృతి కర్భందా చెప్పుకొచ్చింది. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని చెప్పకనే చెప్పేసింది.
Recent Post