బిగ్ బాస్ 4: మోనాల్‌తో డేట్‌కు వెళ్లిన అఖిల్

  Written by : Suryaa Desk Updated: Thu, Nov 26, 2020, 01:31 PM

ఎపిసోడ్ 81లో బిగ్ బాస్ .. అభిజీత్‌, అఖిల్‌లలో ఒక‌రు మోనాల్‌తో డేట్‌కు వెళ్ళాల‌ని చెప్ప‌గా, ఇందుకు అభిజిత్ తిర‌స్క‌రించ‌డంతో అఖిల్ ఆ అవ‌కాశాన్ని అందుకున్నాడు. మోనాల్‌ని ఏడిపించిన కార‌ణంగా డేట్‌కు వెళ్ళాల‌ని బిగ్ బాస్ చెప్ప‌డంతో నాకు ఈ టాస్క్‌లో పాల్గొనాల‌ని లేదు. కాక‌పోతే ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ కోసం టాస్క్ కంప్లీట్ చేస్తాను అంటూ మోనాల్‌తో డేట్‌కు వెళ్ళాడు అఖిల్. స్మ‌శానంలో ఇద్ద‌రు కూర్చొని మ‌న‌సు విప్పి మాట్లాడుకున్నారు
ఐ యామ్ అఖిల్ అంటూ త‌న‌ని ప‌రిచ‌యం చేసుకోగా, మోనాల్ కూడా త‌నకి తానుగా ఇంట్ర‌డ్యూస్ చేసుకుంది. అయితే మోనాల్ అన‌గానే ఫుల్ నేమ్ ఏంట‌ని అడ‌గ‌డంతో మోనాల్ గ‌జ్జ‌ర్ అని పేర్కొంది. గ‌జ్జ‌ర్ అంటే స్వీటా అంటూ కాస్త పులిహోర క‌లిపే ప్ర‌య‌త్నం చేశాడు. ఇంత‌లోనే  నందికొండ వాగుల్లోనా సాంగ్‌ రావడంతో ఇంటి సభ్యులంతా స్టెప్పులు వేస్తూ కనిపించారు.  ఇక ఎపిసోడ్ మ‌ధ్య‌లో అవినాష్ చ‌చ్చిపోయిన ముస‌లాయ‌న‌లా న‌టించి సోహైల్‌, అఖిల్‌, అరియానాల‌ని న‌వ్వించాడు. తాగి వస్తుంటే యాక్సిడెంట్ అయింది అవినాష్ అన్నాడు. ఇప్పుడు ఏం కావాలి అంటే రెండు పెగ్గులు పోయ‌రా అని అడ‌గ‌డంతో , దీనికి ఏది పోసిన తాగుతావా అంటూ కుళ్ళు కామెడీ చేశాడు.
నేటి ఎపిసోడ్ మ‌రింత రంజుగా మార‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఏదో ఫిజిక‌ల్ టాస్క్ బిగ్ బాస్ ఇచ్చిన‌ట్టు నిన్న ఎపిసోడ్ చివ‌ర‌లో విడుద‌లైన ప్రోమోని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. ఏదో వ‌స్తువు కోసం అంద‌రు కుస్తీలు ప‌డ‌డం, చివ‌ర‌కు అవినాష్ హౌజ్ బ‌య‌ట‌కు విసిరేయ‌డం, దీంతో అఖిల్‌.. అలా వేస్తే ఔట‌యినట్టే అని అన‌డం ప్రోమోలో క‌నిపిస్తున్నాయి.
Recent Post