ఓటీటీలో విడుదలవ్వనున్న నాగార్జున 'వైల్డ్ డాగ్'

  Written by : Suryaa Desk Updated: Thu, Nov 26, 2020, 02:06 PM

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సినిమాలన్ని ఓటీటీలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ కాగా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా నాగార్జున మూడీ వైల్డ్ డాగ్ కూడా ఓటీటీలో విడుదలవుతున్నట్లు సమాచారం. ఇటీవలె షూటింగ్ పూర్తికాగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీని ఒకేసారి థియేటర్‌తో పాటు ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. నెట్‌ ఫ్లిక్స్‌ ద్వారా సినిమా విడుదల కానుంది. అహిషోర్‌ సోల్మన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. దియా మిర్జా, సయామీ ఖేర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌ విజయ్ వర్మగా కనిపించనున్నారు.
Recent Post