రవితేజ కోసం మారుతి మాస్టర్ ప్లాన్..

  Written by : Suryaa Desk Updated: Thu, Nov 26, 2020, 03:35 PM

రవితేజ, క్రేజీ డైరక్టర్ మారుతి ఇద్దరు కలిసి సినిమా చేస్తే.. మాస్ ఆడియెన్స్ ను మెప్పించే హీరో రవితేజ అయితే ఫ్యామిలీ మొత్తం ఎంటర్టైన్ అయ్యే సినిమాలు చేసే డైరక్టర్ గా మారుతి సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారని లేటెస్ట్ టాక్. ఈ కాంబినేషన్ లో సినిమా ఎలా ఉంటుందని ఆడియెన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు. రవితేజ కోసం మారుతి మాస్టర్ ప్లాన్ చేశాడని టాక్. అదేంటి అంటే సినిమా మారుతి మార్క్ ఎంటర్టైనర్ గా ఉంటూనే రవితేజ మార్క్ కమర్షియల్ అంశాలను ఉండేలా జాగ్రత్త పడుతున్నారట.
మారుతి, రవితేజ ఈ కాంబో వర్క వుట్ అయితే మాత్రం తప్పకుండా సూపర్ హిట్ మూవీ వచ్చినట్టే అంటున్నారు. కెరియర్ మొదట్లో యూత్ ను ఎట్రాక్ట్ చేసే సినిమాలు చేసిన మారుతి ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న సినిమాలే చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ మారుతి డైరెక్ట్ చేసిన ప్రతిరోజూ పండుగే సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక రవితేజ విషయానికి వస్తే ప్రస్తుతం క్రాక్ సినిమా చేస్తున్న రవితేజ తన నెక్స్ట్ సినిమాను రమేష్ వర్మ డైరక్షన్ లో వస్తుంది.
నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో కూడా రవితేజ సినిమా ఉంటుందని తెలుస్తుంది. మొత్తానికి రవితేజ, మారుతి ఇద్దరు కలిసి సెన్సేషనల్ హిట్ అందుకోవడం పక్కా అని అంటున్నారు. 2021 మొదట్లో ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లి ఆ ఇయర్ ఎండింగ్ కు సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని టాక్.
Recent Post