ఏ సినిమా చేయకపోయినా ట్రేండింగ్ లో ఉన్న అనుష్క.

  Written by : Suryaa Desk Updated: Thu, Nov 26, 2020, 04:30 PM

అనుష్క ప్రస్తుతం ఏ నూతన సినిమా చేయట్లేదు. ఏ సినిమాకి సంతంకం కూడా చేయలేదు. దాంతో పాటుగా ఈ అమ్మడుకు సంబంధించి ఎటువంటి కొత్త కబుర్లు అందలేదు. కానీ కొన్ని రోజులుగా అనుష్క పేరు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది. ఎంతలా అంటే జాతీయ స్థాయిలో అత్యదిక ట్రెండింగ్ పేరుగా నిలిచింది. దీనికి కారణం ఎంతో ఆసక్తికరంగా ఉంది. అదేంటంటే అనుష్క ప్రధాన పాత్రగా నటించి భాగమతి సినిమా బాలీవుడ్‌ రీమేక్‌లో భూమి పడ్నేకర్‌ ప్రధాన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో దుర్గామతిగా తెరకెక్కిన ఈ సినిమాను చూసి అనుష్క అభిమానులు నిరాశచెందారు.
భూమీ మంచి నటే అయినా అనుష్కతో పోలిస్తే దుర్గామతిలో ఆమె తేలిపోయింది. ట్రైలర్‌లో కూడా ఎక్కడా అనుష్కలా మెప్పించలేక పోయింది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులంగా అనుష్క గురించి, అమె నటన గురించి ట్విట్టర్‌లో తెగ పోస్ట్‌లు పెడుతున్నారు. వీరిద్దరిని పోలుస్తూ చర్చలు చేస్తున్నారు. ముఖ్యంగా అనుష్క స్క్రీన్ ప్రజంటేషన్‌కు భూమి ప్రజంటేషన్ పోటీ ఇవ్వలేకపోయిందని అంటున్నారు. ఏ పాత్రకు ఎవరు న్యాయం చేస్తారనేదానికి ఈ రెండు సినిమాలు అద్దం పడుతున్నాయని చెబుతున్నారు. దేశంలో అనుష్క చాలా అరుదైన నటి అని, ఆమెలా పాత్రకు ప్రాణం పోసే వారు లేరని అభిమానులు అనుష్కను ఆకాశానికెత్తేస్తున్నారు. దీంతో ఆమె పేరు భారీగా ట్రెండ్ అవుతోంది. దీంతో ఈ అమ్మడు రేంజ్ అర్థం చేసుకోవచ్చంటూ అభిమానులు అంటున్నారు.
Recent Post