'రంగ్ దే' టీమ్ అంత ధైర్యం చేస్తుందా..?

  Written by : Suryaa Desk Updated: Thu, Nov 26, 2020, 05:21 PM

ప్రపంచ మొత్తం ప్రస్తుతం కరోనా వైరస్ తో సతమతం అవుతుంది. ఎక్కడ చూసినా కరోనా కేసులు.. మరణాలు. జనవరి నుంచి ఈ కరోనా ప్రభావం మొదలైనా.. మార్చి నెల నుంచి దీని విజృంభన బీభత్సం సృష్టించింది. దాంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఇటీవల లాక్ డౌన్ సడలించారు. దాంతో సినీ ఇండస్ట్రీకి మళ్లీ ఊపిరి అందినట్లయ్యింది. మళ్లీ షూటింగ్ లు మొదలు పెడుతున్నారు. అయితే కరోనా ప్రభావంతో ఇతర దేశాల్లో షూటింగ్ లకు ససేమిరా అంటున్నారు. ప్రస్తుతం హీరోలు హైదరాబాదులోనే షూటింగులు నిర్వహిస్తుంటే.. మరికొందరు అవుట్ డోర్ షూటింగులకు కూడా వెళుతున్నారు. ఇంకొందరు విదేశాలకు కూడా వెళ్లి ఏ ఆటంకం లేకుండా షూటింగులు చేస్తున్నారు.
ఆమధ్య ప్రభాస్ అలాగే 'రాధే శ్యామ్' షూటింగును ఇటలీలో నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని వచ్చాడు. తాజాగా హీరో నితిన్ కూడా ప్రభాస్ బాట పట్టారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' చిత్రంలో నటిస్తున్నాడు నితిన్. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి మిగిలి వున్న కొంత షూటింగును ఇప్పుడు దుబాయ్ లో చేస్తున్నారు. అక్కడ నితిన్, కీర్తి సురేశ్ జంటపై కొన్ని సన్నివేశాలను, పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు.
Recent Post