తప్పులు జరుగుతాయి.. ఏం పర్లేదు: హీరో రామ్

  Written by : Suryaa Desk Updated: Wed, Jan 13, 2021, 04:19 PM

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన 'రెడ్' సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా రెడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ‌బుధవారం నిర్వహించారు. ఈ వేడుకకు త్రివిక్రమ్ అతిథిగా వచ్చారు. అయితే ఆ వేడుకలో జరిగిన ఓ తప్పిదం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ ‌లో ముఖ్య అతిథికి ఫస్ట్ డే ఫస్ట్‌ షో బిగ్ టికెట్‌ ను అందిస్తూ ఉంటారు. అదే విధంగా రెడ్ ప్రీ రిలీజ్ ‌కు ముఖ్య అతిథిగా వచ్చిన త్రివిక్రమ్‌ కి బిగ్ టికెట్‌ ను ఇచ్చారు. కానీ ఈ టికెట్‌ కు ఉన్న కవర్‌ ను త్రివిక్రమ్ తీయగానే అందులో క్రాక్ సినిమా టికెట్ ఉంది. వెంటనే తప్పును గమనించిన ఈవెంట్ ఆర్గనైజ్ సంస్థ దాన్ని క్రాక్ పేరుపై రెడ్ స్టిక్కర్ అంటించి ఇచ్చింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే దీనిపై హీరో రామ్ ట్విట్టర్ లో స్పందించాడు. అప్పుడుప్పుడు తప్పులు జరుగుతుంటాయి.. ఏం పర్వాలేదు. అవేం పట్టించుకోకండి. మీరే బెస్ట్ చీర్స్ అని శ్రేయాష్ శ్రీనివాస్ కు ట్వీట్ చేశాడు. తన ట్వీట్ ‌తో హీరో రామ్ మరోసారి తన పాజిటివ్ నెస్ ను చూపించాడు.
Recent Post