నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న జాక్వెలిన్

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 15, 2021, 08:08 AM

ఈ మధ్య కాలంలో హీరోయిన్లు సినిమాలలో కన్నా కూడా బయట ఎక్కువగా అందాలను మరింత చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు.. సోషల్ మీడియా లో కొత్త ఫోటో షూట్ ఫోటోను అభిమానులతో పంచుకుంటారు. ఇండస్ట్రీ తో సంబందం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అదే పనిలో బిజీగా ఉన్నారు. ఎప్పటికప్పుడు తాజా ఫోటోలను దించడం సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తారు. వాటికి వస్తున్న కామెంట్లను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయడం , హాట్ టాపిక్ అవుతున్నారు. కరోనా వల్ల చాలా రోజులు ఇళ్లకే పరిమితమైన హీరోయిన్లు అందాలకు మెరుగులు దిద్దారు. ఫిట్ నెస్ అంటూ చాలా కష్టపడ్డారు..


తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ అందాలకు పనిపెట్టింది. అందాలను చూపిస్తూ తీసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.నెటిజన్ల ఘాటు కామెంట్స్ ను కూడా అందుకుంటున్నాయి.ఆమె ఎవరో కాదు... జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌.. అలాద్దీన్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీలంకన్ సుందరి.. ఆ తర్వాత హౌస్ ఫుల్ ప్రాంఛైజీ చిత్రాలతోపాటు స్టార్ హీరోల సినిమాల్లో తన అందచందాలు, నటనతో అందరిని ఆశ్చర్యపరిచింది.. ఆకట్టుకుంది.


ఈ అమ్మడు సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ ఇన్ స్టాగ్రామ్ లో హాట్ లుక్ ఫొటోలు పోస్ట్ చేసి కుర్రకారును గుండెల్ని పిండేస్తోంది. వైట్ ఫుల్ షర్టుతో బల్లెరినా డ్రెస్ తో స్టన్నింగ్ చేసే ఫోజులు ఇచ్చి మెస్మరైజ్ చేస్తున్నాయి. జాక్వెలిన్ హాట్ హాట్ గా కనిపిస్తున్న స్టిల్స్ నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఫోటోల పై సినీ తారలు సైతం కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూ లైకులు , షేర్లతో దూసుకుపోతున్నాయి..
Recent Post