దర్శకుడిపై నటి లైంగిక ఆరోపణలు

  Written by : Suryaa Desk Updated: Wed, Jan 20, 2021, 10:37 AM

బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్‌పై నటి, సోషల్ మీడియా సెన్సేషన్ షెర్లిన్ చోప్రా లైంగిక ఆరోపణలు చేశారు. సాజిద్‌పై ఇప్పటికే చాలా మంది మహిళలు లైంగిక ఆరోపణలు చేశారు. దీంతో ఆయనపై ఇండియన్ ఫిలిం అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఏడాది పాటు నిషేదం విధించింది. అంతేకాదు, 2018లో ఇండియాలో #MeToo ఉద్యమం తారా స్థాయిలో ఉన్న సమయంలో సాజిద్‌పై లైంగిక ఆరోపణలు రావడంతో ఆయన్ని ‘హౌస్‌ఫుల్ 4’ ప్రాజెక్ట్ నుంచి కూడా తప్పించారు. అయితే, తాజాగా షెర్లిన్ చోప్రా ఆయనపై ఆరోపణలు చేయడం చర్చనీయాంశం అయ్యింది.


అస్సలు మొహమాటం లేకుండా చాలా బోల్డ్‌గా సాజిద్‌పై ఆరోపణలు చేశారు షెర్లిన్. 2005లో సాజిద్ వద్ద తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ‘‘నా తండ్రి చనిపోయిన కొన్ని రోజుల తరవాత 2005 ఏప్రిల్‌లో నేను సాజిద్‌ను కలిశాను. అతని ప్యాంట్‌లో నుంచి మర్మాంగాన్ని బయటికి తీసి చూపించాడు. దాన్ని ఫీల్ అవ్వమని నన్ను అడిగాడు. పురుషాంగం ఎలా ఉంటుందో నాకు తెలుసు అని అతడికి చెప్పడం ఇప్పటికీ నాకు గుర్తుంది. అతడితో నా మీటింగ్ అతడి పురుషాంగాన్ని ఫీలవడానికి, దానికి రేటింగ్ ఇవ్వడానికి కాదు అని కూడా చెప్పాను’’ అని షెర్లిన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


 


మరి ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదు అని ఒక ట్విట్టర్ యూజర్ అడిగిన ప్రశ్నకు షెర్లిన్ స్పందిస్తూ.. ‘‘అతడి క్యారెక్టర్‌ను సమర్థించడానికి అతడి దగ్గర బాలీవుడ్ సూపర్‌స్టార్స్ ఉన్నారు. వాళ్లకు వ్యతిరేకంగా ఇదే నా మాట. బాలీవుడ్ మాఫియా బలమైన సిండికేట్’’ అని ఆరోపించారు. దీనికి కొనసాగింపుగా వరుస ట్వీట్లు చేసిన షెర్లిన్.. సాజిద్ తన పురుషాంగాన్ని బయటికి తీసి పట్టుకోమనడమే కాకుండా దాన్ని ఆస్వాదించమన్నాడని ఆరోపించారు. ‘‘నువ్వు ఎప్పుడైనా పురుషాంగాన్ని చూశావా.. ఇదిగో తీసుకో’’ అని అన్నాడని పేర్కొన్నారు.


తాను ఊరకనే ఈ ఆరోపణలు చేయడం లేదని.. ఈ ఘటనకు సంబంధించి తన వద్ద ఫోన్ రికార్డ్ ఆధారాలు కూడా ఉన్నాయని షెర్లిన్ స్పష్టం చేశారు. తన తండ్రి డాక్టర్ ప్రేమ్ సాగర్ చోప్రా మరణించిన తరవాత తాను బాధలో కూరుకుపోయానని.. అలాంటి సమయంలో తనను సాజిద్ మీటింగ్‌కు పిలిచాడని షెర్లిన్ వెల్లడించారు. కానీ, ఈ మీటింగ్ అతడి పురుషాంగంపై ఉంటుందని తాను అనుకోలేదని వాపోయారు.


 

Recent Post