వెబ్‌ సిరీస్ తో రి ఎంట్రీ ఇవ్వనున్న ‌మినిషా లంబా

  Written by : Suryaa Desk Updated: Wed, Jan 20, 2021, 11:26 AM

బాలీవుడ్ మూవీ భూమిలో చివరిగా నటించింది హీరోయిన్  మినిషా లంబా..సంజయ్ దత్ నటించిన భూమి చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత మినిషాకి సినిమా ఛాన్స్ లు రాలేదనే చెప్పాలి.కాగా మరోవైపు టెలివిజ్ లోనూ తన అదృష్టాన్ని చెక్ చేసుకుంటోంది మినిషా. పలు సీరియల్స్ లో కూడా నటించింది. 2014లో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లో కంటెస్టెంట్ గా మెరిసింది ఆ తర్వాత మినిషా బాగా గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి. దీంతోపాటు `చూనా హై ఆస్మాన్‌`, `కామెడీ నైట్‌ బచ్చావో`, `తెనాలి రామా`, `ఇంటర్‌నెట్‌ వాలా లవ్‌` సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులని కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు సినిమాలే కాదు, టీవీ అవకాశాలు కూడా లేవు. ఈ క్రమంలో ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ చేస్తుందట. `కుతుబ్ మినార్ అనే మూవీతో మళ్ళీ ఆడియెన్స్ ముందుకు రాబోతోందట ఈ ముద్దుగుమ్మ.


 


 
Recent Post