భారీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే?

  Written by : Suryaa Desk Updated: Wed, Jan 20, 2021, 12:08 PM

పూజా హెగ్డేకి కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ తదుపరి సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాకు నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమాను గ్రాండ్ గా లాంఛ్ చేయనున్నట్లు స‌మాచారం. అయితే పూజాహెగ్డే హీరోయిన్ గా ఫైన‌ల్ అయిన విష‌యంపై సినిమా టీం అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు పూజాహెగ్డే ఈ ఏడాది స‌ల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేయ‌నుంది. మొత్తానికి ఇటు తెలుగు, అటు హిందీలో వ‌రుస సినిమాలు చేస్తూ పూజా.. త‌న అభిమానులు, ఫాలోవ‌ర్లు ఫుల్ ఎంట‌ర్ టైన్ చేస్తోంది.
Recent Post