రాధికపై వరలక్ష్మి కామెంట్స్..

  Written by : Suryaa Desk Updated: Wed, Jan 20, 2021, 03:51 PM

వరలక్ష్మీ శరత్ కుమార్.. ఈ పేరు తెలుగువారికి పెద్దగా తెలియక పోవచ్చు. ఎందుకంటే ఈ అమ్మడు తమిళ నటి కాబట్టి. వరలక్ష్మీ.. తమిళ సూపర్ స్టార్ శరత్ కుమార్ కూతురు. అంటే రాధిక వరలక్ష్మి తల్లి కాదు. శరత్ కుమార్ మొదటి భార్య కూతురు వరలక్ష్మి. ఇది అలా ఉంటే తన సవతి తల్లి రాధిక గురించి వరలక్ష్మీ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. వరలక్ష్మీ తెలుగులో రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టిందనే చెప్పాలి. జయమ్మగా సముద్రఖని సరసన ఆయనకు పోటీగా నటించి ప్రేక్షకులను బాగానే మెప్పించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వరలక్ష్మీ తన సవితి తల్లి రాధిక గురించి మాట్లాడుతూ.. 'ఆమె నా తల్లి కాదు. కానీ నాతో చాలా ఫ్రెండ్లీగా ఓ ఫ్రెండ్‌లా ఉంటుంది. అంతేకాదు నా కెరియర్ కు సంబందించిన సూచనలు, గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. అయితే నేను ఎప్పుడైనా ఆమెకు ఏదైనా రహస్యం చెబితే.. మాత్రం దాన్ని వెంటనే అందరికీ లీక్ చేసేస్తుంది. అయితే అందులో దురుద్దేశం ఉండదు.. అలా పొరపాటున జరిగిపోతుంది.ఇలా నా రహస్యాలను లీక్ చేసి చాలా సార్లు నన్ను ఇబ్బంది పెట్టారు అంటూ తన సవితి తల్లి రాధిక గురించి చెప్పుకొచ్చింది వరలక్ష్మి.
Recent Post