షారూక్ మూవీ షూటింగ్‌లో కొట్లాట.. దర్శకుడిపై దాడి

  Written by : Suryaa Desk Updated: Wed, Jan 20, 2021, 05:28 PM

బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్ మూవీ షూటింగ్‌లో గొడవ జరిగింది. వివరాల్లోకి వెళ్తే షారూక్ ఖాన్, సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో పఠాన్ అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన రానప్పటకీ షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతుంది. ఇందులో బాలీవుడ్ బాద్ షా సరసన దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ లో భాగంగా అంతా మెుబైల్ ఫోన్లను పక్కన పెట్టాలని సిద్ధార్థ్ ఆనంద్ మూవీ సభ్యులకు సూచించారు.
అయితే అందులో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ సిద్దార్థ్ మాటలను పట్టించుకోలేదు. దీంతో వారిద్దరి మధ్య మాటల యుద్ధం మెుదలైంది. ఈ క్రమంలో షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారట.అయినప్పటికీ ఆ గొడవ చల్లారలేదట. సిద్ధార్థ్ మామూలుగా ఉన్నప్పటికీ..అసిస్టెంట్ మాత్రం మిగిలిన వారిపై కూడా అసభ్యకరంగా మాట్లాడాట. ఇది కాస్త సిద్దార్థ్ వరకు వెళ్లడంతో ఆ అసిస్టెంట్ దగ్గరకు వెళ్లి చెంపై కొట్టినట్లు తెలుస్తోంది. వెంటనే ఆ అసిస్టెంట్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ని కూడా కొట్టినట్లు తెలుస్తోంది.
దీంతో వివాదం కాస్త పెద్దగా అవ్వడంతో షూటింగ్‌ని ఆపేశారట. ఇక ఇది కాస్త నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ దగ్గరకు వెళ్లడంతో ఆ అసిస్టెంట్‌ని ఉద్యోగంలో నుంచి తీసేసినట్లు సమాచారం. కాగా ఈ మూవీని త్వరగా పూర్తి చేసి వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
Recent Post