హీరోయిన్ నజ్రియా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్

  Written by : Suryaa Desk Updated: Wed, Jan 20, 2021, 05:52 PM

సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ కి గురవుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీల ఇన్ స్టా అకౌంట్లు హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఎక్స్‌ప్రెషన్ క్వీన్ నజ్రియా నజీమ్ ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్ కి గురైంది. వివరాల్లోకి వెళ్తే జనవరి 18న రాత్రి 10.55 గంటలకు నజ్రియా లైవ్ లోకి వచ్చింది. తన అభిమాన నటి లైవ్ లోకి రావడంతో అభిమానులు ప్రశ్నలు వేసేందుకు రెడీ అయ్యారు. ఇంతలో బూతులతో కూడిన వీడియో హల్ చల్ చేసింది. దీంతో తన అకౌంట్ హ్యాక్ కి గురైందని ఆమె గమనించింది. అటు అభిమానులు సైతం గమనించారు.\
వెంటనే నజ్రియా ఓ పోస్ట్ పెట్టారు. కొంతమంది జోకర్లు నా అకౌంట్‌ని హ్యాక్ చేశారు. నా నుంచి వచ్చే మెసేజ్‌లకు కొన్ని రోజుల పాటు ఎవ్వరూ స్పందించకండి. నన్ను నోటీస్ చేసినందుకు థ్యాంక్స్‌. అందరికీ గుడ్‌నైట్ అని ఇన్‌స్టా స్టోరీలో పెట్టారు. కాగా మలయాళం, తమిళంలో పలు హిట్ చిత్రాల్లో నటించిన నజ్రియా.. ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తోన్న అంటే సుందరానికి మూవీలో నజ్రియా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది
Recent Post