నైట్ పార్టీలో హీరోయిన్ అప్సరతో కలిసి మరోసారి ప్రత్యక్షమయ్యాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫొటోకి క్యాప్షన్ కూడా పెట్టారు. హమారే ఫిల్మ్ మే హమారీ ఏంజిల్ క్వీన్ అప్సరా రాణి కే ఐటెమ్ సాంగ్ దేక్ నే.. కే బాద్ ఆప్కే.. #డి కంపెనీ కా డ్యాన్స్ ఖతమ్!“ అంటూ ఈ ఫోటోని షేర్ చేయడమే గాక.. వ్యాఖ్యను జోడించారు ఆర్జీవీ. ఫోటోలో అప్సరను ఆలింగనం చేసుకుని ఎలా ఫోజిచ్చారో చూస్తున్నారుగా.ప్రకృతి వైపరీత్యం అంటే ఇదే కాబోలు ఆర్జీవీ! అంటూ ఒక వీరాభిమాని ఫన్నీ ట్వీట్ వేసాడు. ఆర్జీవీ అభిమానులు ఒక్కొక్కరూ ఒక్కోలా ఫన్నీ కామెంట్లతో చెలరేగుతున్నారు. ముంబై మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పై `డి కంపెనీ` పేరుతో సినిమా తీస్తున్న ఆర్జీవీ.. ఇందులో వేడెక్కించే హాట్ ఐటెమ్ నంబర్ ని అప్సరా రాణిపై చిత్రీకరించారు. ఆ పాటకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఐటెమ్ సాంగ్ షూట్ పూర్తయింది. అనంతరం ఇలా వోడ్కా పార్టీలో మునిగి తేలారన్నమాట.