ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్చి 5న రాజ్ త‌రుణ్ 'పవర్ ప్లే' మూవీ విడుదల..

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 23, 2021, 02:06 PM



యంగ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్‌ల‌ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న లేటెస్ట్ మూవీ `పవర్ ప్లే`. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్నఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కి మంచి  రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మార్చి 5న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయ‌నున్నారు. ఈ మూవీని యూఎస్ఎ లో గ్రేట్ ఇండియా ఫిలింస్ రిలీజ్ చేస్తుండ‌గా ఆస్ట్రేలియాలో స‌థ‌ర‌న్ స్టార్ ఇంట‌ర్‌నేషన‌‌ల్‌, మిడిల్ ఈస్ట్‌లో మ‌ను రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా..
చిత్ర నిర్మాతల్లో ఒకరైన దేవేష్ మాట్లాడుతూ  -  ``రాజ్ త‌రుణ్‌, కొండా విజ‌య్ కుమార్ కాంబినేష‌న్‌లో డిఫ‌రెంట్ జోన‌ర్‌లో వ‌స్తోన్న చిత్ర‌మిది. మార్చి 5న వ‌రల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం.  ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణ‌లో వరంగల్ శ్రీను 'కార్తికేయ ఎగ్జిబిట‌ర్స్' ద్వారా గ్రాండ్‌గా విడుద‌ల‌వుతుంది. అలాగే  యూఎస్ఎ లో గ్రేట్ ఇండియా ఫిలింస్, ఆస్ట్రేలియాలో స‌థ‌ర‌న్ స్టార్ ఇంట‌ర్‌నేషన‌‌ల్‌, మిడిల్ ఈస్ట్‌లో మ‌ను రిలీజ్ చేస్తున్నారు. అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ మూవీ త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌ని థ్రిల్ చేస్తుంది`` అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ పా‌ల‌ప‌ర్తి అనంత్ సాయి మాట్లాడుతూ  - పోస్ట్ ప్రొడక్షన్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 5న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌ల‌వుతున్న `ప‌వ‌ర్‌ ప్లే`  త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com