ఆ క్రికెటర్ పై మనసుపడ్డ సినీ హీరో భార్య!

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 23, 2021, 05:03 PM

బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ భార్య మీరా రాజ్‌పుత్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సోమవారం సాయంత్రం ఆమె ఇన్‌స్టాగ్రమ్‌లో ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్’‌ సెషన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలో మీ క్రష్‌ ఎవరని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె.. ‘నాకు దక్షిణాఫ్రియా క్రికెటర్‌ ఏబి డివిలియర్స్‌ అంటే క్రష్‌, ఐ లవ్‌ హిమ్’ ‌ అంటూ సమాధానం ఇచ్చారు. దీనికి షాహిద్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందని నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. షాహిద్‌-మీరాలు 2015 లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు.
Recent Post