యాంకర్ శ్రీముఖి తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. వారు అడిగిన ప్రశ్నలకు అప్పుడప్పుడు రెప్లైలు కూడా ఇస్తుంటుంది. తాజాగా.. శ్రీముఖి తన ఫ్యాన్స్ కి అడిగిన ఫొటోలు పంపుతానని, ఏదైనా ఆసక్తికర విషయాలు అడిగితే చెబుతానని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో చెప్పింది.
దీంతో ఫ్యాన్స్ ఆమెను పలు ప్రశ్నలు, ఫోటోలు అడిగారు. ఈ క్రమంలో ఓ అభిమాని ఆమె నగ్న చిత్రాన్ని షేర్ చేయమని అడిగాడు. దీంతో అతడికి శ్రీముఖి ఝలక్ ఇచ్చింది. నేకెడ్, నగ్నం పేరిట సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో తీసిన సినిమా టైటిల్ పేరును పంపింది. ఆమె సమయస్ఫూర్తికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.