పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ను చూడాలని, కలిసి మాట్లాడాలని చాలా మంది అభిమానులు అనుకుంటున్నారు. ఇక ఇండస్ట్రీలో ఉన్న అభిమానులు అయితే పవన్‌తో ఒక్కసారైనా వర్క్ చేయాలని చూస్తుంటారు. అలాంటి అవకాశం ఇప్పుడు బిగ్‌బాస్ బ్యూటీకి వచ్చింది. ఇక ఆ బ్యూటీ ఆనందానికి అవధుల్లేవు. ఎగిరి గంతులు వేస్తోంది. ఈ అవకాశం నాకు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఇప్పుడు వచ్చింది అంటూ సోషల్ మీడియాలో అభిమానులతో ఆ విషయాన్ని షేర్ చేసుకుంది. ఇంతకు పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆ బ్యూటీ ఎవరంటే హిమజ. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ద్వారా మంచి ఫేమ్‌ని సంపాదించుకున్న హిమజ.. ఆ తరువాత సినిమాల్లోకి వచ్చారు.