మోహ‌న్ బాబుకి శ్రీ‌మ‌తి పాత్ర‌లో మీనా...!

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 26, 2021, 03:31 PM

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు..అందాల నటి మీనా అంటేనే ఠక్కున గుర్తుకు వచ్చే మూవీ అల్లరి మెుగుడు. ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అనేది తెలుగుప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైలాగ్ డెలివరీలతో హీరో మోహన్ బాబు ఉర్రూతలూగిస్తే తన అందం అభినయంతో ప్రేక్షుకులను మైమరపించిన నటి మీనా. ఈ ఇద్దరి కాంబినేషన్ లో అనేక సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో అల్లరి మెుగుడు మూవీ సూపర్ డూపర్ హిట్. దాదాపు 30 ఏళ్ళ క్రితం వీరి కాంబినేష‌న్ లో వ‌చ్చిన `అల్ల‌రి మొగుడు` బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఆ త‌రువాత ఈ ఇద్ద‌రు `పుణ్య‌భూమి నా దేశం`, `మామ మంచు - అల్లుడు కంచు` చిత్రాల్లో క‌లిసి న‌టించారు. క‌ట్ చేస్తే.. ఆరేళ్ళ విరామం అనంత‌రం వీరిద్ద‌రి కాంబోలో మ‌రో సినిమా రాబోతోంద‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే మోహ‌న్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో `స‌న్ ఆఫ్ ఇండియా` పేరుతో ఓ సోష‌ల్ మెసెజ్ మూవీ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. డైమండ్ రత్న‌బాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ మేస్ట్రో ఇళ‌య‌రాజా బాణీలు అందిస్తున్నారు. కాగా, ఇందులో మోహ‌న్ బాబుకి శ్రీ‌మ‌తి పాత్ర‌లో మీనా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నార‌ట‌. క‌థ‌ని కీల‌క మ‌లుపు తిప్పే పాత్ర ఇద‌ని స‌మాచారం.
Recent Post