ఆలియా భట్ ''గంగూబాయి కతియావాడి'' ఫై రాజమౌళి, చరణ్ ట్వీట్స్..

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 26, 2021, 04:03 PM

తాజాగా అలియా నటించిన ''గంగూబాయి కతియావాడి'' సినిమాపై రాజమౌళి, చరణ్ ప్రశంసలు కురిపించారు.  ఈ సినిమా టీజర్ ను బుధవారం విడుదల చేశారు. ఇందులో "సెక్స్ వర్కర్" గంగూబాయి పాత్రలో ఆలియా అద్భుతంగా కనిపించింది. ఈ టీజర్ పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో రామ్ చరణ్ - రాజమౌళి కూడా ఈ టీజర్ ను గురించి ట్వీట్ చేశారు.
రాజమౌళి స్పందిస్తూ.. ''గంగూబాయిగా ఆలియా భట్ అద్భుతంగా కుదిరింది. వెండితెరపై సంజయ్ లీలా భన్సాలీ వర్క్ చూసేందుకు  ఎదురుచూస్తున్నాను'అని ట్వీట్ చేసాడు.
చరణ్ ట్వీట్ చేస్తూ..''గంగూబాయి టీజర్ అద్భుతంగా ఉంది సంజయ్ సర్. ఆలియా స్క్రీన్ ప్రజెన్స్ చాలా గొప్పగా ఉంది. ఈ సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను'' అని పేర్కొన్నాడు. వీరి ట్వీట్స్ కి స్పందించిన అలియా ఇద్దరికీ ధన్యవాదాలు తెలిపింది.
Recent Post