కొత్త ఇళ్లు కొన్న బాలయ్య... రేటు ఎంతంటే ?

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 26, 2021, 04:48 PM

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌ కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. ప్రస్తుతం బాలయ్య జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబ‌ర్ 1లో ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న జూబ్లీహిల్స్ ఏరియాలోనే ఒక కొత్త భ‌వ‌నాన్ని కొనుగోలు చేశారు. గ్రౌండ్ ప్ల‌స్ టూ ఫ్లోర్స్ ఉన్న ఈ భ‌వ‌నం విలువ రూ. 15 కోట్లు అని తెలుస్తోంది. 9,935 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంతో విశాలంగా ఈ భ‌వ‌నాన్ని నిర్మించారు. న‌డింప‌ల్లి స‌త్య‌శ్రావ‌ణి అనే ఆమె నుంచి ఈ ఇంటిని బాల‌య్య కొనుగోలు చేశారు. ఫిబ్ర‌వ‌రి 11న ఆ ఇంటిని త‌న పేరిట బాల‌కృష్ణ రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నారు. దీని కోసం స్టాంప్ డ్యూటీ రూ. 82.5 ల‌క్ష‌లు, రిజిస్ట్రేష‌న్ ఫీజు రూ. 7.5 ల‌క్ష‌లు వెచ్చించారు. మే నెల‌లో ఆయ‌న గృహ‌ప్ర‌వేశం చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ష‌న్‌లో బీబీ 3 సినిమాలో న‌టిస్తున్నారు. దానికి 'గాడ్‌ఫాద‌ర్' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. మ‌రోవైపు రాజ‌కీయాల్లోనూ చురుకుగా పాల్గొంటున్న ఆయ‌న హిందూపురం ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న సంగతి తెలిసిందే.
Recent Post