ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్చ్ 19న “ఓ మంచి రోజు చూసి చెప్తా”...!

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 26, 2021, 05:33 PM



 ఆరుముగా కుమార్ దర్శకత్వంలో  విజయ్ సేతుపతి హీరోగా మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా విడుదలై విజయవంతం అయిన తమిళ చిత్రం “ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్”. మరి ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో “ఓ మంచి రోజు చూసి చెప్తా” అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకం పై డాక్టర్ రావూరి వెంకటస్వామి ఈ చిత్రం తెలుగు హాక్కులను భారి ధరకి సొంతం చేస్తున్నారు. ఈ చిత్రానికి “ఓ మంచి రోజు చూసి చెప్తా” అనే పేరుతో మార్చ్ 19న విడుదల చెయ్యడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ “ఓ మంచి రోజు చూసి చెప్తా” చిత్రం తమిళం లో మంచి విజయం సాధించింది. విజయ్ సేతుపతి గారి నటన ఈ చిత్రానికే ఒక హై లైట్. విలక్షణ నటనతో ప్రేక్షకులని అలరిస్తాడు. నిహారిక కొణిదెల గారు ఎప్పుడు చేయని పాత్రలో కనిపిస్తారు. ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. తెలుగు ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ చిత్రాన్ని మార్చ్ 19 న భారీగా విడుదల చేస్తున్నాము” అని తెలిపారు.ఇక ఈ చిత్రంలో సేతుపతి, నిహారికలతో పాటుగా గౌతమ్ కార్తీక్, గాయత్రీ శంకర్, విజి చంద్ర శేఖర్, రమేష్ తిలక్ మరియు తదితరులు నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com