“క్లైమాక్స్” మూవీకి యూ/ఏ సర్టిఫికెట్...

  Written by : Suryaa Desk Updated: Sat, Feb 27, 2021, 01:04 PM

భవాని శంకర్. కె. దర్శకత్వంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా విభిన్న కథతో విచిత్ర పాత్రలు, కథనాలతో రాజేశ్వర్ రెడ్డి , కరుణాకర్ రెడ్డి నిర్మాతలుగా తెరకెక్కిన చిత్రం “క్లైమాక్స్”. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ తో మార్చి 5న విడుదల కాబోతుంది. అయితే ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ట్రైలర్‌లో మోడీ డౌన్ డౌన్ అనే నినాదాలపై వివాదం కాగా తాజాగా వచ్చిన సెన్సార్ సెర్టిఫికెట్ వాటన్నిటికి సమాధానం చెబుతుందని చిత్ర యూనిట్ చెబుతుంది. అయితే ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ తో పాటు సాషా సింగ్, శ్రీ రెడ్డి, పృద్వి, శివ శంకర్ మాస్టర్, రమేష్ తదితరులు నటించారు. క్లైమాక్స్, మర్డర్ మిస్టరీతో పాటు ట్విస్ట్స్ మరియు బ్యాక్ డ్రాప్ కామెడీ ఇలా అన్ని ఈ సినిమాలో ఉన్నాయని, మునుపెన్నడు చూడని థ్రిల్లింగ్ క్లైమాక్స్ ని చూపించడానికి మా క్లైమాక్స్ తో మార్చ్ 5 న మీ ముందుకు వచేస్తున్నామని ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నామని అన్నారు.
Recent Post