ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీలోనూ దుమ్మురేపిన రవితేజ ‘క్రాక్’...!

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 27, 2021, 01:25 PM



 రవితేజ ‘క్రాక్’ చిత్రం సంక్రాంతికి విడుదలైన భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 50 శాతం ఆక్యుపెన్సీలో కూడ ఏ సినిమా వసూళ్లు దుమ్మురేపింది. హక్కుల్ని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు భారీ లాభాలను చూశారు. ఈ సినిమాతో రవితేజ హిట్ ట్రాక్ ఎక్కారు. థియేటర్లలో మాస్ ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. ఇందులో రవితేజకు జోడీగా శృతి హాసన్ నటించింది. ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని ఆహా ఓటీటీ ద్వారా విడుదలచేశారు. అక్కడ కూడ సినిమా మాస్ మహారాజ్ మేనియా కనబడుతోంది. ఇప్పటి వరకు సినిమా 250 మిలియన్ వ్యూస్ మినిట్స్ అందుకుందట. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. అంటే ఇక్కడ సినిమా హిట్ కొట్టేసినట్టే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com