“చెక్” మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్

  Written by : Suryaa Desk Updated: Sat, Feb 27, 2021, 01:51 PM

భీష్మ” సినిమాతో కమెర్షియల్ గా మంచి హిట్ తో కం బ్యాక్ ఇచ్చిన యూత్ స్టార్ నితిన్ ఇప్పుడు ప్రయోగాత్మక చిత్ర దర్శకుడు చంద్రశేఖర్ యేలేటితో చేసిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ “చెక్” తో ముందుకొచ్చారు. రకుల్ ప్రీత్ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ లు కీలక పాత్రల్లో నటించారు.  టీజర్లు, ట్రైలర్లు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచడంతో మంచి క్రేజ్‌తో  ప్రేక్షకుల నిన్న ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం తొలి రోజున బాక్సాఫీస్ వద్ద ఎంత వసూల్ చేసిందంటే. యూత్‌లో ఉండే నితిన్ క్రేజ్‌కు అనుగుణంగా నైజాంలో చెక్ చిత్రం భారీగానే వసూళ్లు నమోదు చేసింది. తొలి రోజున రూ.1.46 కోట్ల మేర కలెక్షన్లను సాధించింది. ఇక సీడెడ్ విషయానికి వస్తే రూ.47 లక్షలు వసూలు చేసింది. అలాగే ఉత్తరాంధ్రలో ఈ చిత్రం రూ.34 లక్షలు కలెక్ట్ చేసింది. ఇక ఆంధ్రా విషయానికి వస్తే.. తూర్పు గోదావరి జిల్లాలో రూ. 14 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.10 లక్షలు, గుంటూరులో రూ. 57.4 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.21 లక్షలు, నెల్లూరులో రూ.8.6 లక్షలు వసూలు చేసింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.338 కోట్లు నికరంగా, రూ.5.34 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.  ఇక తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో, అలాగే ఓవర్సీస్ విషయానికి వస్తే.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.8 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.10 లక్షలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.3.56 కోట్ల నికర వసూళ్లు, రూ.5.70 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. చెక్ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడానికి రూ.16.5 కోట్ల మేర వసూళ్లు సాధించే లక్ష్యంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి రోజున రూ.3.56 కోట్లు వసూలు చేసిందనే లెక్క ప్రకారం.. రానున్న రోజుల్లో ఈ చిత్రం సుమారు రూ.13 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.
Recent Post