‘వకీల్ సాబ్’కి పవన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

  Written by : Suryaa Desk Updated: Wed, Apr 07, 2021, 04:13 PM

పవన్ కళ్యాణ్ సినిమాకు ఎంత తీసుకుంటాడు..? ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. వరస ఫ్లాపులు వస్తున్నా కూడా పవర్ స్టార్ సినిమా అంటే ఏదో తెలియని మోజు ప్రేక్షకులకు. అందుకే ఆయన రెమ్యునరేషన్ కూడా ఎప్పుడూ ఆకాశంలోనే ఉంటుంది. పవన్ డేట్స్ ఇస్తే పండగ చేసుకోడానికి చాలా మంది నిర్మాతలు క్యూలో ఉంటారు. దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత కూడా పవన్ కళ్యాణ్ సినిమా చేయడానికి 22 ఏళ్లు వేచి చూసాడు. ఆయన డేట్స్ ఇస్తే చిన్న నిర్మాతలా పండగ చేసుకున్నాడు. హిట్టు ఫ్లాపులతో పని లేకుండా పవన్ ఎంత అడిగితే అంత ఇవ్వడానికి నిర్మాతలెప్పుడూ రెడీగానే ఉంటారు. ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ సినిమా గురించి ఇప్పుడు ఇండస్ట్రీ అంతా హాట్ టాపిక్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత చేసిన సినిమా కావడంతో దీనికోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఎప్రిల్ 9న ఈ సినిమా విడుదల కానుంది. పింక్ సినిమాకు రీమేక్‌గా శ్రీరామ్ వేణు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాలో పవన్ ఎంతసేపు ఉంటాడనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి సమాధానం వచ్చేసింది. వకీల్ సాబ్ సినిమాలో పవన్ ఉండేది కేవలం 52 నిమిషాలు మాత్రమే అని తెలుస్తుంది. మరోవైపు వకీల్ సాబ్ సినిమా నడివి అక్షరాలా రెండున్నర గంటలు. అంటే సినిమాలో దాదాపు గంటన్నర పాటు పవన్ కనిపంచడు. సినిమా మొదలైన తర్వాత అరగంటకు గానీ పవన్ ఎంట్రీ ఉండదు. అక్కడ్నుంచి సినిమా అంతా దాదాపు పవన్ కనిపిస్తూనే ఉంటాడు. కేవలం 50 నిమిషాలు మాత్రమే కనిపించడానికి పవన్ 50 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంటే నిమిషానికి కోటి రూపాయలు తీసుకున్నాడన్నమాట.
Recent Post