శ్రుతి హసన్‌పై బీజేపీ ఫిర్యాదు

  Written by : Suryaa Desk Updated: Wed, Apr 07, 2021, 05:20 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎం చీఫ్ కమల్ హసన్ కోయంబత్తూరు సౌత్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. మక్కల్ నీది మయం(ఎంఎన్ఎం) చీఫ్ కమల్ హసన్‌ కుమార్తె, నటి శ్రుతి హసన్‌పై ఎలక్షన్ కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో ఓటేసిన అనంతరం ఆయన.. తన కూతుళ్లు అక్షర, శ్రుతి హసన్‌తో కలిసి నేరుగా కోయంబత్తురు సౌత్‌ నియోజకవర్గానికి వెళ్లారు. ఓటింగ్ సరళిని సమీక్షించడానికి నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఆ సమయంలో కమల్ హాసన్ వెంట శ్రుతి హసన్ కూడా ఉండటంతో ఆమె అక్రమంగా పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించారని, క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
Recent Post