ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కేసీఆర్‌ బయోపిక్‌ లో నటించినందుకు గర్వపడుతున్నా: హీరో శ్రీకాంత్‌.‌

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 20, 2021, 10:59 AM



తెలంగాణ ఉద్యమం గురించి తెలియజేసే  సినిమా ‘తెలంగాణ దేవుడు’ ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి అని తెలంగాణ రాష్ట్ర హోమ్‌మంత్రి మెహమూద్‌ అలీ అన్నారు. శ్రీకాంత్‌ టైటిల్‌ పాత్రలో జిషాన్‌ ఉస్మాన్, సంగీత, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’ వడత్య హరీష్‌ దర్శకత్వంలో మహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజవుతోంది.‘‘గతంలో సినీ ఇండస్ట్రీ కొందరి చేతుల్లోనే ఉండేది. వాళ్లు తీస్తేనే థియేటర్స్‌ ఓపెన్‌ అయ్యి సినిమాలు ఆడాలనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మారుతోంది. ఇంకా మార్పు తెస్తాం’’ అన్నారు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌. ‘‘ఈ బయోపిక్‌ తీయడం మా అదృష్టం’’ అన్నారు నిర్మాత జాకీర్, దర్శకుడు హరీష్‌. ‘‘కేసీఆర్‌ గారి పాత్ర చేసినందుకు గర్వపడుతున్నా’’ అన్నారు హీరో శ్రీకాంత్‌.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com