కొందరు స్టార్ డైరెక్టలకు హీరోల కంటే కూడా ఎక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ముందు వరుసలో ఉంటాడు.‘తను వెడ్స్ మను’ వంటి బాక్సాఫీస్ హిట్ చిత్రాలను అందించిన ఆయన తాజాగా ముంబైలో ఓ డూప్లెక్స్‌ను కొనుగోలు చేశారట బాలీవుడ్ లో సంచలన విజయాలు సాధించిన డజను చిత్రాల్ని తెరకెక్కించిన ఘనత ఆయన సొంతం. తను వెడ్స్ మను- తను వెడ్స్ మను రిటర్న్స్ – రాంజానా- శుభ్ మంగల్ జ్యాదా సావధాన్- తుంబాద్- లాల్ కప్టాన్ వంటి బ్లాక్ బస్టర్లు తెరకెక్కించారు. షారూక్ తో జీరో చిత్రాన్ని తెరకెక్కించినా అది బాక్సాఫీస్ వద్ద విఫలమైన సంగతి తెలిసిందే. ఆనంద్ ఎల్ రాయ్ తన భార్య యోగితతో కలిసి రూ. 25.3 కోట్ల పెట్టుబడిని బంగ్లాపై పెడుతున్నారు. 5761 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇల్లు ఐదు కార్ పార్కింగ్ స్లాట్ లను కలిగి ఉంది. ఈ ఇంటి కోసం మార్చి 8 న రూ. 75.9 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారట.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ భవనంలో 34 అపార్ట్మెంట్లు ఉంటాయని తెలుస్తోంది.