అక్కినేని ఎన్టీయార్ ల నుంచి నేటి హీరోల వరకూ చాలా మంది హోమ్ వర్క్ గట్టిగానే చేస్తూ వస్తున్నారు. ఇపుడు ఇదే వరసలో అక్కినేని నాగార్జున తన కొత్త చిత్రం విషయంలో యుద్ధ కళలను నేర్చుకోవడానికి ఏకంగా విదేశీ ఫైటర్ల నుంచి ఆన్ లైన్ పాఠాలను నేర్చుకుంటున్నాడుట. వాటి మీద తన దగ్గర ఉన్న ఫైట్ మాస్టర్ల సాయంతో ప్రాక్టీస్ కూడా చేస్తున్నారుట. ఇదంతా నాగార్జున దేని కోసం చేస్తున్నారు అన్న డౌట్ రావచ్చు. ఆయన ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి విధితమే. ప్రవీణ్ సత్తార్ గరుడ వేగ మూవీని అద్భుతంగా తీసి రాజశేఖర్ కి మంచి హిట్ ని ఇచ్చారు. ఇపుడు ఆయన నాగ్ తో ఒక యాక్షన్ మూవీని ప్లాన్ చేశాడు. ఈ మూవీలో ఫైట్లు కూడా అదిరిపోయే రేంజిలో ఉంటాయట. ఈ ఫైట్స్ కోసం నాగ్ అన్ని రకాలుగా రెడీ అవుతున్నారుట. క్రవ్ మగా అనే యుద్ధ కళను నాగ్ ఆన్ లైన్ క్లాసుల ద్వారా నేర్చుకుంటున్నారు అంటున్నారు. ఈ మూవీలో నాగ్ రియల్ ఫైట్స్ ఈ వయసులో చేస్తారు అంటేనే ఆసక్తి అందరిలో పెరుగుతోంది. అదే సమయంలో నాగ్ ఈ మూవీ కోసం కష్టపడుతున్న తీరు కూడా ముచ్చట గొలిపేలా ఉంది. గత కొన్నాళ్ళుగా సరైన హిట్ లేని నాగ్ ప్రవీణ్ సత్తార్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు అంటున్నారు. మొత్తానికి నాగ్ నేర్చుకుంటున్న పాఠాలు యువ హీరోలకు గుణ పాఠాలు అని కూడా అంటున్నారు.