ప్రస్తుతం మహేష్ బాబు.. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న'సర్కారువారిపాట' సినిమా లో నటిస్తున్నాడు. కీర్తి సురేష్ కథానాయికగా చేస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. అయితే ఈ రోజు ప్రిన్స్ మహేష్ సోషల్ మీడియా ద్వారా అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ రోజు సూపర్‌స్టార్ మహేష్ అమ్మ ఇందిర గారి పుట్టినరోజు. మహేష్ బాబు తల్లి ఇందిర దేవి బయట కనిపించడం చాలా అరుదు. మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లలో కుటుంబ సభ్యులు అందరూ కనిపిస్తుంటారు గాని, ఇందిర దేవి కనిపించిన సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి. మహేష్ అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ఫొటో షేర్ చేశారు.