ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బన్నీ 'ఐకాన్' నుంచి తప్పుకున్నాడా..?

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 20, 2021, 01:50 PM



ఇటీవల 'పుష్ప' టీజర్ లాంఛ్ లో దర్శకుడు సుకుమార్ భావోద్వేగంతో అల్లుఅర్జున్ కి ఆపాదించిన బిరుదు 'ఐకాన్ స్టార్'. అప్పటి నుంచి స్టైలిష్‌స్టార్ కాస్తా 'ఐకాన్ స్టార్' గా మారిపోయాడు. ఇక అప్పుడెప్పుడో దిల్ రాజు బ్యానర్ లో వేణుశ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' పేరుతో ఓ సినిమా మొదలెట్టాడు బన్నీ. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఆ ప్రాజెక్ట్ అటకెక్కేసింది. మధ్యలో దిల్ రాజు 'ఐకాన్' ఉంటుందని చెప్పినా ఎవరికీ నమ్మకం కలగలేదు. కానీ 'వకీల్ సాబ్' రిలీజ్ తర్వాత మరోసారి 'ఐకాన్' చర్చలలోకి వచ్చింది. దిల్ రాజు వేణుశ్రీరామ్ తో 'ఐకాన్' ఉంటుందని ప్రకటించాడు. ఫ్యాన్స్ కూడా బన్నీ నే 'ఐకాన్' స్టార్ అని ఊహించుకున్నారు. అయితే ఎక్కడో ఏదో బెడిసి కొట్టినట్లు ప్రచారం జరుగుతోంది. బన్నీ 'ఐకాన్'కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదంటున్నారు. ఇటీవల జరిగిన సక్సెస్ మీట్ లో కూడా ఐకాన్ స్టార్ మేమిచ్చింది కాదు... తనంతట తాను తీసుకున్నది అని దిల్ రాజు అనటం ఈ రూమర్స్ కి బలం చేకూరుస్తుందంటున్నారు. దిల్ రాజు మాటలు బన్నీ ఫ్యాన్స్ ను బాగా హర్ట్ చేశాయంటున్నారు. తన ఇమేజ్ కి తగ్గట్లు 'ఐకాన్' స్క్రిప్ట్ లో భారీ మార్పులు కోరుతున్నాడట బన్నీ. అయితే ఈ విషయంలో దిల్ రాజు, దర్శకుడు అంత సుముఖంగా లేరని వినికిడి. ఇక పారితోషికం పరంగాను బన్నీ ఫ్యాన్సీ రెమ్యూనరేషన్ ఆశిస్తున్నాడట. దాంతో దిల్ రాజు 'ఐకాన్' లో నటించటానికి మరో స్టార్ హీరోని వెతుకుతున్నాడట. దీంట్లో నిజానిజాలేమిటన్నది తెలియరాలేదు. అటు బన్నీ, ఇటు దిల్ రాజు లో ఎవరో ఒకరు నోరువిప్పితే తప్ప 'ఐకాన్' స్టార్ ఎవరనేది బయటకు రాదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com