ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను షూటింగ్‌ కి రాలేను : జగపతిబాబు

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 20, 2021, 02:00 PM



కరోనా మహమ్మారి విజృంభిస్తుంది, ఈ నేపథ్యంలో షూటింగ్స్ చేయాలన్నా, చిత్రీకరణలో పాల్గొనాలన్నా కూడా అందరి గుండెలలో గుబులు రేగుతుంది. ఈ క్రమంలో విలక్షణ నటుడు జగపతిబాబు కొద్దిరోజుల వారకు తాను షూటింగ్‌లో పాల్గొనలేనని దర్శక నిర్మాతలకు స్ట్రైట్‌గా చెప్పేశాడట. కరోనా తీవ్రత దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం జగపతి బాబు శర్వానంద్, సిద్ధార్ద్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న మహా సముద్రం చేస్తున్నాడు. మహా సముద్రం తాజా షెడ్యూల్ వైజాగ్‌లో జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో జగపతి బాబు పాల్గొనాల్సి ఉండగా, కరోనా తీవ్రత వలన రాలేనని చెప్పాడట. రీసెంట్‌గా ఆయన తన ట్విట్టర్‌లో మేకప్ వేసుకుంటున్న ఫొటో షేర్ చేస్తూ.. కరోనా వలన నాకు నేను మేకప్ మెన్‌గా మారానని ఓ ఫొటో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈయనకు తెలుగులోనే కాక తమిళం,హిందీ భాషలలోను పలు ఆఫర్స్ వస్తున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com