ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను షూటింగ్ లో పాల్గొనలేను పూజాహెగ్డే..?

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 20, 2021, 04:37 PM



యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ లవ్ స్టోరీ ''రాధే శ్యామ్''. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ - యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. 1960ల నాటి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో విక్రమాదిత్యగా ప్రభాస్.. ప్రేరణగా పుజా కనిపించనున్నారు. జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తవ్వగా.. కొద్దిగా ప్యాచ్ వర్క్ మరియు వీఎఫ్ఎక్స్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాధే శ్యామ్' చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న కృష్ణంరాజు మరియు హీరోయిన్ పూజాహెగ్డే లకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉందట. అయితే కోవిడ్ నేపథ్యంలో షూటింగ్ చేయడం కష్టంగా మారిందట. వయసు రీత్యా కృష్ణంరాజును ఒత్తిడి చేసే అవకాశం లేదు. అలానే పాండమిక్ కారణంగా పూజాహెగ్డే కూడా షూట్ కి రావడానికి నిరాకరించినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇంటికే పరిమితమైన బుట్టబొమ్మ కరోనా పరిస్థితులు మారితే తప్ప షూట్ కి రాకపోవచ్చని అంటున్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది కాబట్టి సీజీ వర్క్స్ తో పాటు మిగతా పనులు పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుందట. జూన్ నాటికి పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో 'రాధే శ్యామ్' సినిమా అనుకున్న సమయానికి వస్తుందా లేదా అనేది చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com