అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో నటించిన చిత్రం బెల్‌బాటమ్. ఈ మూవీ మే నెలలో ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కాబోతుందని ఇప్పటికే వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే తమ ఫేవరేట్ స్టార్ అక్షయ్‌కుమార్ సినిమా ఓటీటీలో రాబోతుందనే సరికి అభిమానులు నిరాశలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ పూజా ఎంటర్టైన్మెంట్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. బెల్‌బాటమ్ ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు వస్తున్న వార్తలు వాస్తవం కాదని క్లారిటీ ఇచ్చింది. సినిమాకు సంబంధించిన ఏ స్టేట్మెంట్ అయినా నిర్మాణ సంస్థ ద్వారా మాత్రమే వస్తుందని..థర్డ్ పార్టీ నుంచి కానీ, ఏ యాక్టర్ నుంచి ప్రకటన ఉండబోదని తెలిపింది. స్పై థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రానికి రంజిత్ ఎం తివారీ దర్శకుడు. వాణీకపూర్, హ్యుమాఖురేషి, లారా దత్తా కీ రోల్స్ పోషిస్తున్నారు.