వకీల్ సాబ్ సినిమా యూనిట్ పై ఓ వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తన అనుమతి లేకుండా తన ఫోన్ నంబర్ ను సినిమాలో పెట్టడం వల్ల రోజు ఎవరెవరో ఫోన్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. వకీల్ సాబ్ సినిమాలో అంజలికి చెందిన ఫోటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి ఆ ఫోటో కింద తన నంబర్ ను పెట్టాడని సుధాకర్ అనే వ్యక్తి తెలిపాడు. అందువల్ల గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆయన పంజాగుట్ట పోలీసులకు తెలిపారు. చిత్ర యూనిట్ పై కేసు నమోదు చేయాలని కోరారు. ఇది ఇలా ఉంటె పోలీసులు ఇంకా ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేయలేదు.