రికార్డు క్రియేట్ చేసిన బుట్టబొమ్మ సాంగ్

  Written by : Suryaa Desk Updated: Tue, May 04, 2021, 05:16 PM

గతేడాది సంక్రాంతికి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే కదా. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ మాత్రం తెలుగులో ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోంది. అంతేకాదు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కెరీర్‌లోనే అతి పెద్ద హిట్ ఈ ఆల్బమ్. సినిమా పరంగా దుమ్ము దులిపేసిన అల వైకుంఠపురములో పాటల విషయంలో కూడా సంచలనం సృష్టిస్తుంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు రూ. 150 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి 2020 టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. టిక్ టాక్, డబ్ స్మాష్ ఎక్కడ చూసినా కూడా బుట్టబొమ్మే దర్శనమిచ్చింది. ఇప్పుడు ఈ పాట మరో సంచలన రికార్డు అందుకుంది. యూట్యూబ్‌లో సెన్సేషనల్ హిట్టై ఏకంగా 600 మిలియన్ వ్యూస్ సాధించింది. ఆగస్ట్ 1న 300 మిలియన్ క్లబ్బులోకి అడుగు పెట్టిన బుట్టబొమ్మ.. మరో 200 మిలియన్స్ అందుకోడానికి నాలుగు నెలల సమయం తీసుకుంది. 500 మిలియన్ వ్యూస్ అంటే జనవరి 7న క్రాస్ చేసింది. తాజాగా ఈ పాట 600 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. తెలుగులో ఈ రికార్డు అందుకున్న తొలి తెలుగు పాటగా రికార్డు క్రియేట్ చేసింది.
Recent Post