ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వంటలక్కను దారుణంగా తిట్టిన డాక్టర్ బాబు

cinema |  Suryaa Desk  | Published : Mon, May 10, 2021, 05:10 PM



కార్తీకదీపం సీరియల్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఒకే కథలో సాగుతున్న ఈ సీరియల్ ఇప్పటికీ అదే కథతో ప్రసారం అవుతూనే ఉంది. అయినా కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తూ టీవీల ముందు వాలిపోతున్నారు. ఇక ఈ సీరియల్ స్టార్ మా లో అత్యధిక రేటింగ్ తో మొదటి స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సీరియల్ ప్రభావం అందరిపై ఉంది. దీప ఆరోగ్య సమస్య కారణంగా కార్తీక్ దీప విషయంలో మొండితనం చేయడంతో అసలు కారణం తెలుసుకోవడానికి దీప తన పాత ఇంటికి తిరుగు ప్రయాణం చేస్తుంది. అంతేకాక అక్కడే ఉండి వంటలక్కగా గరిట పట్టుకోవడానికి సిద్ధమయింది. ఇక ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా దీప కనపడకపోయేసరికి భయంతో ఆందోళన చెందుతారు. ఇక కార్తీక్, దీప ఆరోగ్యం గురించి భారతితో చెప్పమని కోరుతాడు. కానీ ధైర్యం చేసి చెప్పలేక అక్కడినుంచి వెళ్ళిపోతుంది భారతి. ఇక అక్కడి నుంచి మోనిత వాళ్ళ ఇంటికి వెళ్లిన భారతి.. అక్కడ దీప ఫైల్స్ చూసి షాక్ అవుతుంది. అంతేకాకుండా దీప గురించి ఆలోచనలో పడుతుంది భారతి. ఇక జరిగిందంతా మోనిత కు చెప్పగా.. తను మళ్ళీ తన మాటలతో రగిలిపోతుంది.


ఇక భారతి మోనిత ప్రేమ విషయంలో సపోర్ట్ చేయనని తేల్చి చెప్పగా.. వెంటనే రగిలిపోయిన మోనిత భారతిని ఇంట్లోకి నుంచి వెళ్లిపో అంటుంది. ఇక ఆ ఫైల్ గురించి గట్టిగా అడుగుతుంది భారతి. ఇక మోనిత వెంటనే షాక్ లో అక్కడే కనబడుతుంది. ఇక దీప తన పాత ఇంటికి వెళ్ళగా.. అక్కడ తను మళ్లీ వంట చేయడం మొదలుపెడుతుంది. ఇక దీప సరోజ తో కలిసి పొయ్యి ముందు కూర్చుని ముచ్చట్లు పెడుతుంది. ఇక అక్కడికి చేరుకున్న కార్తీక్, మోనిత..లను చూసి మోనిత పై విశ్వరూపం చూపిస్తూ బూడిద చేసి పారేస్తా అంటూ గట్టిగా బెదిరిస్తుంది దీప. ఇక కార్తీక్ కోపంతో తన చేతిలో ఉన్న కట్టెపుల్ల లాక్కొని పక్కన పడేసి దీప చేయి పట్టుకొని అక్కడి నుండి తీసుకెళ్తాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com