ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'స్టాండప్ రాహుల్' పేరుతో రాజ్ తరుణ్ కొత్త సినిమా

cinema |  Suryaa Desk  | Published : Tue, May 11, 2021, 11:57 AM



వరుస పెట్టి వైఫల్యాలు చవి చూస్తున్న హీరోల్లో రాజ్ తరుణ్ ఒకరు. కెరీర్ మొదట్లో దొరికిన విజయాలు తప్ప మళీ విజయం దక్కింది లేదు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. తాజాగా రాజ్ తరుణ్ నుండి మరో కొత్త సినిమా వస్తుంది. స్టాండప్ రాహుల్ పేరుతో కొత్త తరహాలో కొత్త ఒరవడితో తెలుగు ప్రేక్షకులు చూడని కొత్త అవతారంలో రాజ్ తరుణ్ కనిపించబోతున్నాడు. స్టాండప్ కమెడియన్ గా ఈ సినిమాలో నవ్వులు పూయించనున్నాడు.


సంతో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్న స్టాండప్ రాహుల్ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా కనిపిస్తుంది. ఏ విషయాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోని పాత్రలో రాజ్ తరుణ్ కనిపిస్తున్నాడు. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్వీకర్ అగస్తి సంగీతం అదిస్తున్నారు. మరి స్టాండప్ రాహుల్ సినిమాతోనైనా రాజ్ తరుణ్ నిలబడతాడేమో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com