ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభిజీత్ తల్లికి కరోనా పాజిటివ్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 12, 2021, 08:56 AM



లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు అభిజీత్. ఆతర్వాత మిర్చిలాంటి కుర్రాడు అనే సినిమా చేసాడు. ఆతర్వాత అభిజీత్ కు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. దాంతో పెళ్లిగోల అనే వెబ్ సిరీస్ చేసాడు. అయితే నాగార్జున హోస్ట్ గా వ్యవరించిన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు అభి. దాంతో ఒక్కసారిగా ఈ కుర్రాడు ఫెమస్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లో అభిజీత్ గేమ్ ఆడిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫలితంగా అతడు సీజన్ విన్నర్ అయ్యాడు. ఇదిలా ఉంటే తాజాగా అభిజీత్ తల్లి కరోనాబారిన పడ్డారు. ఈ విషయాన్నీ అభిజీత్ స్వయంగా తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో లైవ్ ద్వారా అభిమానులతో ముచ్చటించ్చాడు. ఆసమయంలో మాట్లాడుతూ… “అమ్మకు కొవిడ్‌ పాజిటివ్‌ అన్న విషయం తెలిసింది. ఏదైతే భయపడ్డామో అదే జరిగింది. కుటుంబ సభ్యులంతా పరీక్ష చేయించుకుంటే అందరికీ నెగెటివ్‌ వచ్చింది. కాస్త ఊరటనిచ్చే విషయం ఏంటంటే అమ్మకు సీటీ లెవల్స్‌ బావున్నాయి. త్వరగానే కోలునికుంటుందని ఆశిస్తున్నా… అంటూ ఎమోషనల్ అయ్యాడు.


నా దృష్టిలో కరోనా సోకిన వారిని ఓ గదిలో బంధించినట్లు చేయకూడదు. ఐసోలేషన్‌లో ఉండటం అనేది చెత్త విషయం. మనం దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. దీని గురించి అంతగా మాట్లాడాలని లేదు.. ఎంత తక్కువ మాట్లాడడుకుంటే అంత మంచిది. నేను ఈ టైం ను వెస్ట్ చేయకుండా బుక్స్‌ చదువుతున్నా. స్పానిష్‌ నేర్చుకుంటున్నా..ఏదైనా కొత్తగా చేయాలనుకుంటున్నా..” అని తెలిపాడు అభిజీత్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com