ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రికెట్ కోచ్ గా సరికొత్త ప్రయోగం చేయనున్న మహేష్ బాబు

cinema |  Suryaa Desk  | Published : Wed, May 12, 2021, 12:16 PM



సూపర్ స్టార్ మహేష్ బాబు- అనీల్ రావిపూడి కాంబినేషన్ మరో సినిమాకి సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే, మరోసారి మహేష్ ని లాక్ చేసేందుకు అనీల్ రావిపూడి ఏ ఒక్క అవకాశాన్ని విడిచి పెట్టడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఈసారి మహేష్ కోసం అనీల్ ఎంచుకున్న పాత్ర పైనా లీక్స్ అందాయి. సరిలేరులో మహేష్ ని ఆర్మీ ఆఫీసర్ గా చూపించిన అనీల్.. తదుపరి సినిమాలో ఆసక్తికర పాత్రలో చూపిస్తారట. ఇందులో మహేష్ క్రికెట్ కోచ్ గా కనిపించనున్నాడని క్రీడా నేపథ్య చిత్రమిదని సోర్సెస్ చెబుతున్నాయి. క్రికెట్ శిక్షకుడి పాత్ర మహేష్ కి నచ్చిందని లీకులందుతున్నాయి. అలాగే అనీల్ మార్క్ ఎంటర్ టైన్ మెంట్ ఇందులో మిస్ కాకుండా జాగ్రత్త పడుతున్నారట. సరిలేరు నీకెవ్వరు లో మహేష్ ఆర్మీ ఆఫీసర్ అనగానే సీరియస్ యాక్షన్ స్టోరీ అనుకున్నారు. కానీ ఆ తర్వాత బయటకొచ్చిన ప్రచార చిత్రాల్ని బట్టి అనీల్ మార్క్ వినోదాత్మక చిత్రమిదని అర్ధమైంది. సంక్రాంతి బరిలో సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ వసూళ్లను సాధించింది.  అందుకే ఈ జోడీ రిపీటవుతోందనగానే అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com