ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫేస్ ప్యాక్ వేసుకుని కంటి చూపు కోల్పోయిన ' టిక్ టాక్ స్టార్ '

cinema |  Suryaa Desk  | Published : Wed, May 12, 2021, 02:19 PM



మీరు సోషల్ మీడియాలో బ్యూటీ టిప్స్ చూసి ఫాలో అవుతుంటారా... వాళ్లు చెప్పిన క్రీములు, లోషన్లూ అప్లై చేసుకుంటారా.. జాగ్రత్త...ఈమె కథ తెలుసుకొని అప్పుడు నిర్ణయం తీసుకోండి. టిక్ టాక్ బ్యూటీ, ఆస్ట్రేలియా బిగ్ బ్రదర్ కంటెస్టెంట్... 21 ఏళ్ల టిల్లీ విట్‌ఫెల్డ్... తన విషాద కథను నెటిజన్లతో పంచుకుంది. ఓ వీడియో చూసి...అప్లై చేసుకున్న బ్యూటీ టిప్.. ఆమెను గుర్తుపట్టలేని విధంగా మార్చేసింది. చివరకు ఆస్పత్రిపాలైంది తనలా ఎవరూ ఇలాంటి తప్పు చేయవద్దని కోరుతూ...తన కథను నెటిజన్లతో పంచుకుంది. బిగ్ బ్రదర్ షోలో ఆమె... తన ఫేసుకు బ్లూ క్లే ఫేస్ మాస్క్ ధరించింది. అలా ఎందుకు ధరించావని నెటిజన్లు అడిగారు. దాంతో అసలేం జరిగిందో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. ఈ బ్యూటీ కంటిన్యూగా టీవీ షోలు ఇతరత్రా ఫ్యాషన్ ప్రోగ్రామ్స్ చేస్తూ... నిరంతరం ఫేసుకి మేకప్ వేసుకుంటూనే ఉంది.


2 నెలల కిందట టిక్ టాక్‌లో ఓ అక్యుపంక్చర్ బ్యూటీ టిప్ వీడియో చూసింది. అది నచ్చడంతో... సేమ్ అలాగే ఇంట్లో అప్లై చేసుకుంది. కానీ అది ఆమెకు రియాక్షన్ ఇచ్చింది. ముఖం మాడిపోయింది. కాలిపోయింది. మచ్చలు వచ్చేశాయి. కురుపులు వచ్చేశాయి. మొత్తం తేడా కొట్టింది. అందమైన ఫేస్ కాస్తా... ఇలా అయిపోయింది. ఈ ఘటన తర్వాత ఆమె ఆస్పత్రి పాలైంది. తన ఫేసును తానే గుర్తు పట్టలేని విధంగా అయిపోవడం చూసి షాకైంది. ఆ బ్యూటీ టిప్ కారణంగా... ఆమెకు ఎడమ కన్ను తాత్కాలికంగా కనిపించట్లేదు. ముఖంపై వచ్చిన ఎర్రటి మచ్చలు చాలా కాలం ఉంటాయట. దయచేసి నాలాగా ఎవరూ ఇలాంటి ' హోమ్ హ్యాక్స్' చేయకండి. సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు చూసి మోసపోకండి. ఏం చేసుకోవాలన్నా ప్రొఫెషనల్స్ ద్వారానే చేసుకోండి అని సూచించింది టిల్లీ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com