ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడిగినందుకు ధన్యవాదాలు ఐ లవ్‌ యూ రానా : మిహికా

cinema |  Suryaa Desk  | Published : Thu, May 13, 2021, 11:30 AM



భళ్లాల దేవ రానా దగ్గుబాటి గత ఏడాది ఆగస్టు 8న వేదమంత్రాల సాక్షిగా మెచ్చిన నెచ్చెలితో ఏడడుగులు నడిచి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టాడు. అయితే నిన్నటికి సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయానికి.. ప్యార్‌ మే పడిపోయానే.. అంటూ భళ్లాల దేవ రానా దగ్గుబాటి ప్రేమ పాటలు పాడుకున్నాడు. అంతేనా.. ప్రేమకు అర్థం ఏదంటే నిన్నూ నన్నే చూపిస్తా అన్నట్లుగా మిహికా బజాజ్‌తో దిగిన సెల్ఫీని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. తను నాకు ఎస్‌ చెప్పింది అంటూ ఎగిరి గంతేశాడు. ఈ ఒక్క పోస్ట్‌తో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ లిస్ట్‌లో ఉన్న రానా సడన్‌గా సైడ్‌ అయిపోయినట్లు అందరికీ అర్థమైపోయింది. దీంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు రానాకు శుభాకాంక్షలు తెలిపారు అయితే తన దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి నిన్నటికి ' మే 12 ' సరిగ్గా ఏడాది అవుతుండటంతో రానా గతంలో షేర్‌ చేసిన పోస్టును మరోసారి అభిమానులతో పంచుకుంది మిహికా బజాజ్‌. "రానా తన మనసులో మాట అడిగాడు. నేను సరేనంటూ తలాడిస్తూ నా అంగీకారం తెలిపాను. నా జీవితంలో తీసుకున్న అత్యుత్తుమ నిర్ణయం ఇదే కాబోలు. ఇది జరిగి సంవత్సరం అయిందంటే నమ్మలేకపోతున్నాను. ఏదేమైనా అడిగినందుకు ధన్యవాదాలు. ఐ లవ్‌ యూ రానా.." అని రాసుకొచ్చింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com