‘పేపర్ బాయ్’ సినిమాతో పరిచయం అయిన సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా మూవీ ‘ఏక్ మినీ కథ’. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధాదాస్ కీలక పాత్ర పోషిస్తుంది.కార్తీక్ రాపోలు దర్శకత్వం వహిస్తున్నారు. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా' వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథ అందించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసారు. కానీ పరిస్దితులు బాగోలేవు. దాంతో దాంతో ఓటీటి లో ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుందట. బోల్డ్ అడల్డ్ పాయింట్‌తో వస్తున్న ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. అడల్ట్ టచ్ కామెడీ మూవీ కావడంతో అమెజాన్ కూడా మంచి రేటుకే కొనేందుకు ముందుకు వచ్చిందట. రూ.9 కోట్లకు ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసినట్లు సమాచారం. నిజానికి ఈ సినిమాకు నిర్మాతలు చాలా లో బడ్జెట్ లో ప్లాన్ చేసారట. రూ.5 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఏకంగా 9 కోట్లకు బేరం కుదరడంతో నిర్మాతలు సంతోషంగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.