ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఏంచేయాలో చెప్పిన సీనియర్ నటి

cinema |  Suryaa Desk  | Published : Fri, May 14, 2021, 10:18 AM



మహావేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను కంట్రోల్‌ చేయడానికి ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలలో అవగాహన కల్పించే ప్రయత్నయాలు చేస్తున్నాయి.. ప్రభుత్వానికి తోడు సెలెబ్రెటీలు కూడా ప్రజలకు పలు జాగ్రత్తలు చెబుతున్నారు. తమకు తోచిన సలహాలు ఇస్తున్నారు. ప్రివెన్షన్‌ ఈజ్‌ క్యూర్‌ బెటర్‌ దెన్‌ ట్రీట్‌మెంట్‌ అన్న నానుడి ఉండనే ఉంది.


ఇదే విషయాన్ని నటి మీనా ఓ వీడియోలో చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ వీడియోలో కరోనా బారిన పడకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చో వివరించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో మాస్క్ ఎలా ధరించాలో ఆమె చూపించారు.


బాలనటిగా సినిమాల్లో అడుగుపెట్టిన మీనా తర్వాత హీరోయిన్‌ అయ్యారు. అగ్రశ్రేణి హీరోలందరి సరసనా నటించారు. స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. తెలగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించిన మీనా ఆ మధ్యన దృశ్యం సినిమాతో మళ్లీ పాపులరయ్యారు.. ఇన్నాళ్లకు దృశ్యం 2లో నటించి మంచి హిట్టు కొట్టారు. ప్రస్తుతం తెలుగు, మలయాళ సినిమాల్లో మీనా బిజీ ఆర్టిస్టయ్యారు. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించారు మీనా. చిరంజీవి, వెంకటేష్లతో చాల సినిమాల్లో నటించారు మీనా. ప్రస్తుతం తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న అన్నతే సినిమాలో మీనా నటిస్తున్నారు. అలాగే బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో బాలయ్య తో కలిసి నటించనున్నారని తెలుస్తుంది. అలాగే మరో రెండు తెలుగు సినిమాలు కూడా ఈ అందాల నటి చేతిలో ఉన్నాయని తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com