అఖిల్ మూడవ సినిమాకి సన్నాహాలు

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 02:32 PM
 

అఖిల్ మూడవ సినిమా కోసం అక్కినేని అభిమానులంతా ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయడానికి సన్నాహాలు మొదలుకానున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అఖిల్ తో సినిమా చేయడానికి భారీ చిత్రాల నిర్మాత భోగవల్లి ప్రసాద్ ఆసక్తిని చూపుతున్నారట.


ఆ మధ్య పవన్ కల్యాణ్ .. ప్రభాస్ .. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో భారీ సినిమాలు చేసిన భోగవల్లి ప్రసాద్, కుర్ర హీరోలతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్ తో 'తొలిప్రేమ' చేసిన ఆయన, శర్వానంద్ ను కూడా లైన్లో పెట్టేశారు. ఇక అఖిల్ తో చేద్దామని సంప్రదిస్తే .. ఆయన పారితోషికం 10 కోట్లు అని తెలిసి ఆలోచనలో పడ్డారట. అఖిల్ ను రెండు పరాజయాలు పలకరించినా, జనంలో ఆయనకి గల క్రేజ్ ఎంత మాత్రం తగ్గలేదు. అందువలన ఈ హ్యాండ్సమ్ హీరోకి ఆ మాత్రం ఇచ్చుకోవచ్చు అనే టాక్ కూడా ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.      
Recent Post