చూడటానికి అచ్చం మా అమ్మలాగే ఉంది: మహేశ్‌బాబు

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 03:07 PM
 

 తన గారాలపట్టి సితార అచ్చం తన తల్లి ఇందిరా దేవిలాగే ఉందని అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. సితార ఫొటోను పంచుకుంటూ.. ‘పింక్‌.. గర్ల్‌ పవర్‌.. చూడటానికి అచ్చం మా అమ్మలాగే ఉంది’ అని పోస్ట్‌ చేశారు. దీంతో పాటు హార్ట్‌ సింబల్స్‌ను కూడా జత చేశారు. ఈ ఫొటోకు అభిమానుల నుంచి చాలా లైక్స్‌ వచ్చాయి. మహేశ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో సితార ఫొటో పెట్టిన 15 గంటల్లోనే 1.08 లక్షల మంది లైక్‌ చేశారు. సితార క్యూట్‌గా ఉందని కామెంట్లు పెట్టారు.


మహేశ్‌ ప్రస్తుతం ‘భరత్‌ అనే నేను’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటి కైరా అడ్వాణీ కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నారు. ‘శ్రీమంతుడు’ వంటి హిట్‌ తర్వాత మహేశ్‌-కొరటాల కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది. ఏప్రిల్‌ 20న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. దీని తర్వాత మహేశ్‌-వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది.
Recent Post